ఉప్పు, కారం తింటున్నా కోపం ఉండదా.. శ్రీరెడ్డిపై పవన్ పరోక్ష కామెంట్స్

-

పవన్ కళ్యాణ్‌ను శ్రీరెడ్డి ధూషించిన సంగతి అందరికీ తెలిసిందే. మీడియా ముందే రెచ్చిపోయిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ అమ్మను కూడా తిట్టేసింది. దీంతో సినీ ఇండస్ట్రీలో పెద్ద ప్రకంపనలే ఏర్పడ్డాయి. అనంతరం శ్రీరెడ్డి తట్టాబుట్టా సర్దుకుని చెన్నై చెక్కేసింది. అయితే సందు దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ తనను ధూషించిన వారికి కౌంటర్స్ వేశాడు.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ ప్రసంగిస్తూ అనేక విషయాలను టచ్ చేశాడు. చిన్నప్పటి నుంచి ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడో వివరించాడు. సీఎం అవుదామని రాజకీయ పార్టీ పెట్టలేదని, ఆ నాడు పార్టీని స్థాపించినప్పుడు కూడా అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తాను రాజకీయాల్లోకి నా స్వార్థం కోసం రాలేదని తెలిపాడు. ఇంత మంది చేత మాటలు అనిపించుకోవల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.

మొన్న కాకినాడలో ఎవరో.. ఒక నాయకుడు తిట్టినట్టుగా అలాంటి మాటలు తిట్టించుకోక్కర్లేదని అన్నాడు. వ్యక్తిగతంగా తనను అలాంటి మాటలు అంటుంటే.. ఒకవేళ పూర్తిగా యాక్టర్ అయ్యింటే.. గతంలో తాను యాక్టర్‌గా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసేవాడినో అలా చేసేవాడినని తెలిపాడు. అలాగే.. చాలామంది తన తల్లిని దూషించారని.. తిట్టకూడని పదంతో తన తల్లిని తిట్టారని గుర్తు చేసుకున్నాడు. ఇవన్నీ ఎందుకు పడ్డాను? ఉప్పు, కారం తింటున్నవాడిని కోపం ఉండదా. పౌరుషం లేదా నాకు? కడుపు మండదా? అంటూ ప్రశ్నించాడు. మరి ఈ వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version