ఏపీ మంత్రులపై దాడి.. కొడి కత్తి కేసు లాంటిదేనని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. కావాలనే… వైసీపీ నేతలు ఈ రాద్ధా ఐదు నెలల క్రితమే జనవాణి కార్యక్రమం నిర్ణయం చేసామని.. విశాఖ గర్జన కు పోటీగా మేము పెట్టలేదు వారి కార్యక్రమం భగ్నం చేసే ఉద్దేశ్యం మాకు లేదని వెల్లడించారు.
జనవాణి జనం గొంతుక అని.. సమస్యలు ప్రభుత్వం పరిష్కారిస్తే మా దగ్గర కు ఎందుకు వస్తారని నిలదీశారు. 3000 కు పైగా జనవాణి కార్యక్రమానికి పిటిషన్లు వచ్చాయని… వాటికి సంబంధించి ఆయా శాఖలకు తెలిపామన్నారు.
మా తండ్రి పోలీస్ కానిస్టేబుల్ అని.. అందుకే పోలీసులు అంటే నాకు గౌరవమని చెప్పారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వంలో గర్జించడం ఏంటి? కడుపు కాలిన వాడు గర్జిస్తాడు. అధికారంలో ఉన్నవారు గర్జిస్తామంటారేంటి? పథకాలు అమలు చేయాలి.. నిరసన తెలుపుతామంటే ఎలా? అని ఆగ్రహించారు పవన్ కళ్యాణ్.