ఉత్తరాంధ్ర గురించి వైసిపి సన్నాసులకు ఏం తెలుసునని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనకి ఈ నేలపై ప్రేమ ఉందని అన్నారు. కోనసీమలో వాళ్ళ మంత్రి ఇల్లు వాళ్లే తగలబెట్టేసి.. చిచ్చుపెట్టే ప్రయత్నం వైసీపీ చేసిందని ఆరోపించారు. అలాగే బీజేపీతో సంబంధాలపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ్టీ నుంచి రాష్ట్ర ముఖ చిత్రం మారుతోందని అన్నారు. జనసేన లాంటి పార్టీ బీజేపీని రోడ్ మ్యాప్ అడగమేంటని విమర్శలు వచ్చాయన్నారు.
ఎందుకో బీజేపీతో పొత్తు ఉన్నా.. పూర్తి స్థాయిలో కలిసి వెళ్లలేకపోతున్నామన్నారు. ఈ విషయం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తెలుసన్నారు. ప్రధాని, బీజేపీ నాయకత్వం అంటే గౌరవమే.. అలాగని ఊడిగం చేయలేమన్నారు. మా భారతమ్మను తిట్టేస్తున్నారని వైసీపీ నేతలు తెగ బాధపడిపోతున్నారని.. నా తల్లి అంజనమ్మని ఎలా విమర్శించార్రా..? అని ప్రశ్నించారు. వైసీపీ గుండాగాళ్లు పద్దతిగా మాట్లాడితే పద్దతే.. లేకుంటే చెప్పుతో కొడదాం అన్నారు.
ప్రతి ఒక్కరూ డిబేట్స్ కి వెళ్లండి.. ఏమైనా తేడాగా మాట్లాడితే పబ్లిక్ గా బాదేయండని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తుంటే విశాఖ వాళ్లకు ఎందుకు కోపం రావడం లేదని ప్రశ్నించారు. కార్మికుల్లారా..! మీరు కదలిరండి.. నేను నిలబడతానన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా నేను అడ్డంగా నిలబడతా.. అవసరమైతే ప్రాణాలిస్తానన్నారు