2025 పరీక్షల్లో 2023 నాటి ప్రశ్నప్రత్నం.. కాళోజీ యూనివర్సిటీలో కొట్టొచ్చిన నిర్లక్ష్యం

-

రాష్ట్రంలోని యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. అధికారులు విద్యార్థుల భవిష్యత్ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని తాజాగా జరిగిన ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. దీంతో మరీ ఇంత నిర్లక్ష్యమా! అని నెటిజన్లు, విద్యార్థులు అధికారుల తీరును తప్పుబడుతున్నారు.


వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పీజీ రేడియాలజీ విభాగంలో ఈనెల 16న పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలో 2023 నాటి పాత ప్రశ్నపత్రం తిరిగి దర్శనమిచ్చింది. దీంతో విద్యార్థులు షాక్ అయ్యారు. పేపర్ 3 పరీక్షలో 2023 నాటి ప్రశ్న పత్రం ఇవ్వడం పట్ల విద్యార్థులు తీవ్ర విస్మయానికి గురయ్యారు.ఈ ఘటనతో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపించింది. పేపర్‌కు సంబంధించిన కోడ్ కూడా మార్చకుండా అప్పటి కోడ్ నెంబర్‌తోనే ప్రశ్నపత్రంను అధికారులు ఇచ్చారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version