విశాఖలో పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ…

-

హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన పీఏసీ సమావేశం ఇంకా కొనసాగుతోంది. అయితే ఏపీలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిలవనున్నారు. ‘జనసేన’ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్ర‌మంలోనే వచ్చే నెల 3న మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలనీ పవన్ కల్యాణ్ ముందుండి నడిపించనున్నారు. ఈ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహించే విషయమై స్థానిక నాయకులతో చర్చించి ఖరారు చేయనున్నట్టు జనసేన పార్టీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version