నాకు ఆ పదవి అక్కర్లేదు.. రాజీనామా చేస్తానంటున్న‌ పృథ్వీ..

-

‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)’ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశం మధ్యలో నుంచే సభ్యులు అర్థాంతరంగా వెళ్లిపోయారు. అయితే మా మూవీ అసోసియేషన్ లో జరుగుతున్న తాజా పరిణామాలపై మండిపడ్డారు నటుడు పృథ్వీ. అసలు నాకు ఈసీ మెంబర్ పదవి అక్కర్లేదంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసారు. నిజానికి ఈసీ మెంబర్ గా గెలిచినందుకు బాధపడాలో సంతోష పడాలో అర్ధం కావడం లేదు అని వాఖ్యానించారు.

కొత్తగా ఏర్పడిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఎవరి గ్రూపులు వారు పెట్టుకున్నారని అన్నారు. ప్రముఖ రచయిత, 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరని గోపాలకృష్ణని ఘోరంగా అవమానించారని విమర్శించారు. ఆయ‌న‌ను మాట్లాడనివ్వకుండా చేసారని , అయన కంటతడి పెట్టుకొని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చాడు పృథ్వీ.. మెంబర్స్ అందురు కలిసి కట్టుగా ఉండాలి కానీ ఇలా ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరించకూడదని అన్నారు. ప్రతి ఒక్కరు దీనిని ప్రెసిడెంట్ అఫ్ ఇండియా గా ఫీల్ అవుతున్నారని పృథ్వీ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version