అసని తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి – పవన్‌ కళ్యాణ్‌

-

అసని తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని.. రైతాంగానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని జగన్‌ సర్కార్‌ ను డిమాండ్‌ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో నెలకొన్న అసని తుపాను ప్రభావం కోస్తా జిల్లాలు, ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోందని… ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని వెల్లడించారు. ఈ ప్రకృతి విపత్తు బారినపడే వారికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని.. వరి పంట కోత కోసే సమయంలో ఈ విపత్తు రావడం దురదృష్టకరమని ఫైర్‌ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

అనేక గ్రామాల్లో ధాన్యం కళ్లాల్లోనే ఉండటంతో రైతులు ఆందోళనలో ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది.. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలి…ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా 17 శాతం మించి తేమ ఉండకూడదు అనే నిబంధన ఈ సమయంలో వర్తింప చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు… కాబట్టి తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలన్నారు.

అసని ప్రభావం వల్ల పండ్ల తోటలకు, ఉద్యాన పంటలు వేసిన రైతులు కూడా దెబ్బ తిన్నారని.. పంటనష్ట పరిహారాన్ని తక్షణమే లెక్కించి వాస్తవ నష్టానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలని కోరారు. తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు… ఇళ్ళు దెబ్బ తిన్నవారిని ఆదుకోవాలి. జనసైనికులు, పార్టీ నాయకులు బాధితులకు బాసటగా నిలవాలనిడిమాండ్‌ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version