విజయవాడలో 35వ పుస్తక మహోత్సవంలో డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా.. OG అంటూ నినాదాలు చేసారు అభిమానులు. దాంతో OG కంటే శ్రీ శ్రీ అనండి అంటూ కామెంట్ చేసారు ఆయన. అలాగే నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చను అంటే పుస్తకాల ప్రభావమే. యూత్ అంతా పుస్తక పఠనం అలవాటు చేసుకోండి. పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు. చీకటిలో ఉనప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది అన్నారు పవన్.
తెలుగు అధ్యాపకులు బలమైన జీతాలు ఉండాలి. నేను బయటికి వచ్చినా పుస్తకాలు నా పక్కనే ఉండాలి. చేతిలో పుస్తకం ఉంటే ఆ ధైర్యమే వేరు. తొలిప్రేమ సినిమాలు వచ్చిన 15 లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొనుకున్నా. కొన్నవన్నీ రూమ్ లో వేసుకుని మూడు రోజులు చదివేసా. మన జీవితకాలంలో అందరూ పదివేల పుస్తకాలు చదవాలి అని సూచించారు పవన్ కళ్యాణ్.