విజయవాడలో 35వ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకం. పుస్తకాలను నా సంపదగా భావిస్తా. నాదగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వడానికి ఆలోచిస్తాను. నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయే వాడినో. నాకు ఏమి కావాలో అది నెచ్చుకోవడానికి పుస్తకాలు ఉపయోగపడ్డాయి. రెండు చోట్లా ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నిలబడేలా చేశాయి.
చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా. పుస్తకాలు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు.. ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం. తెలుగు సరిగ్గా నేర్చుకొనందుకు ఈరోజు నేను బాధపడుతున్నా. స్కూల్ లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ ఒక్కటే పేదరికాన్ని దూరం చేస్తుంది అనడం సరికాదు. ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృ భాష చాలా ముఖ్యం అని పవన్ పేర్కొన్నారు.