అల్లు అర్జున్‌ అరెస్ట్‌ పై పవన్‌ కళ్యాణ్‌ రియాక్ట్‌.. అతన్ని ఒంటరి చేశారు !

-

అల్లు అర్జున్‌ అరెస్ట్‌ పై పవన్‌ కళ్యాణ్‌ రియాక్ట్‌ అయ్యారు..రేవంత్‌ ది సరైన విధానం అన్నట్లుగా మాట్లాడారు పవన్‌ కళ్యాణ్‌. చిట్‌ చాట్‌ లో అల్లు అర్జున్ ఇష్యూపై పవన్ కళ్యాణ్ స్పందించారు. గోటితో పోయే అంశాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారు…. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. వైసీపీ వాళ్లలా వ్యవహరించలేదని పేర్కొన్నారు పవన్‌.

Pawan Kalyan revanth Allu Arjun’s arrest

తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోకి అనేక అవకాశాలు ఇచ్చారన్నారు. డబ్బులు పెంచకపోతే సినిమాకు రికార్డ్స్ ఎలా వస్తాయి? అంటూ చిట్‌చాట్‌లో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేసేసారు… ఎవరి విషయంలో అయినా రేవంత్ రెడ్డి విధానం అదే అన్నారు. ఆ సినిమా విషయంలో రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారు… టికెట్ రేట్లు పెంచడానికి, షో లకి కూడా అనుమతులిచ్చారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news