ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండవ విడత వారాహి యాత్రలో భాగంగా ఏలూరు లో సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు జరిగిన సభలో సీఎం జగన్ పైన ఛలోక్తులు విసిరారు. రాజకీయ నాయకులు రాను రాను వ్యక్తిగత దూషణలకు దిగుతుండడం ప్రజలను ఇబ్బందికి గురి చేస్తోంది అని చెప్పాలి. పవన్ మాట్లాడుతూ.. మన సీఎం జగన్ కు మనుషులు ఎవరిపైన చనిపోయినా మరియు ఆడబిడ్డల తాళి తెగిపోయినా నవ్వు వస్తుందని కామెంట్స్ చేశాడు. ఇక ఇదే విషయాన్ని ఒక ఉదాహరణతో వివరించి చెప్పడం కొందరిని బాధకు గురి చేస్తోందని చెప్పాలి. గతంలో మహేష్ బాబు నాన్నగారు మరియు సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీఎం జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మరియు కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వెళ్లారు.