ఏపీలో పల్లె పండుగ వారోత్సవాలు.. ప్రారంభించిన పవన్ కళ్యాణ్!

-

ఏపీలో ‘పల్లె పండుగ–పంచాయతీ వారోత్సవాలు’ పేరిట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఈ పనులు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి ఈనెల 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ‘పల్లెపండుగ–పంచాయతీ వారోత్సవాల్లో’ భాగంగా అన్ని రకాల అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు.ప్రస్తుతం కృష్ణా జిల్లా కంకిపాడు నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ పాల్గొని పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ మిషన్ ద్వారా రూ.4,500 కోట్లు నిధులతో 30వేల పనులు చేపట్టనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే గత ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆనాడు తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లె సీమల్లో పనులు చేపడుతున్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో 3వేల కి.మీ.సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు, 25వేల నీటి కుంటలు, 22వేల 525 గోకులాలను నిర్మించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version