వారాహి వాహనంలో పవన్‌.. కిక్కిరిసిన బందరు రోడ్డు

-

పవన్ కల్యాణ్ మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనున్న సందర్భంలో,విజయవాడ ఆటోనగర్ నుంచి వారాహి వాహనంలో మచిలీపట్నం బయల్దేరారు. భారీగా పార్టీ శ్రేణులు వెంటరాగా, వారాహి నిదానంగా కదులుతోంది. విజయవాడ బందరు రోడ్డు జనంతో క్రిక్కిరిసిపోవడంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. ఈ ర్యాలీలో జనసందోహాన్ని అదుపుచేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

తాడిగడప జంక్షన్, పోరంకి, పెనమలూరు, పామర్రు, గుడివాడ సెంటర్ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గూడూరు మీదుగా మచిలీపట్నానికి చేరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. సాయంత్రం 5 గంటలకు సభాప్రాంగణానికి చేరుకుంటారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుండి పవన్ కళ్యాణ్ సభకు జనసేన నేతలు భారీగా వెళ్లారు. నియోజకవర్గ ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా పవన్ సభకు ప్రారంభమయ్యారు. బోడస్సకురు బ్రిజ్ పై భారీ ర్యాలీ గా నియోజకవర్గ జనసేన నేతలు ,కార్యకర్తలు భారీగా వెళ్లారు. అలాగే వందలాది కార్లలోనూ జనసేన ఆవిర్భావ సభకు వెళ్లారు. మెగా అభిమానుల ప్రాంతం అమలాపురం నుండి భారీ ర్యాలీగా వెళ్తున్న డ్రోన్ వీడియోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముమ్మిడివరం జనసేన కార్యాలయం నుండి ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో 10 బస్సులు 50 కార్లతో భారీ ర్యాలీగా మచిలీపట్నం జనసేన ఆవిర్భావ సభకు బయలు దేరాయి జనసేన శ్రేణులు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version