పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ స్పీడ్ పెరిగింది.ఈసారి అనుకున్న టైమ్ కు సినిమాను తేవాలని దిల్ రాజు భావిస్తున్నాడు. ఓటీటీల నుంచి ఎంత ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినా పట్టించుకోలేదు.ఎలాగైనా సరే అభిమానుల కోసం థియేటర్లలోకి సినిమాను తీసుకురావాలని చూశారు.అనుకున్నట్లుగానే ఈ డిసెంబర్ లేదా సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.దానిలో భాగంగానే పవన్ జస్ట్ 20 రోజుల సింగిల్ షెడ్యూల్ కు ఈ నెల 26నుంచి హాజరవుతున్నాడు.
పవన్ తన పొలిటికల్ పనులకు కాస్త విరామం ఇచ్చి తన డేట్లు వకీల్ సాబ్ కు ఇచ్చేశాడు. ఈ నెల 26 నుంచి సెట్లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ 20 రోజుల్లో సినిమాను ప్యాచ్ వర్క్ లతో పాటు పూర్తి చేయాలని డిసైడ్ చేశాడు.అందుకు తగ్గట్లుగానే యూనిట్ నుంచి ఫుల్ సపోర్ట్ దొరికింది.డిసెంబరులోగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతికి సినిమాని సిద్ధం చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు. ఈ సినిమా షూట్లో పవన్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్లు తీస్తే సరిపోతుంది. ఇందులో ఓ పాట కూడా ఉంది. ఈ షెడ్యూల్ లో శ్రుతిహాసన్ కూడా పాల్గొననుంది.
ఇక పవన్ సెట్లోకి అడుగుపెట్టడమే ఆలస్యం. జస్ట్ 20 రోజుల కాల్ఫీట్స్ తో వకీల్ సాబ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు.మరి ఉన్న 20డేస్ లో కలుపుకుని వకీల్ సాబ్ రెఢీ అవుతాడా లేదో చూడాలి.