తూర్పుగోదావరి జిల్లా : వైసీపీ పార్టీ ప్రభుత్వం మరియు నాయకులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి నిప్పులు చెరిగారు. తన జోలికి వైసీపీ వస్తే… ఆడ, మడ అని తేడా లేకుండా అందరి తాట తీస్తానని హెచ్చరించారు. బూతులు తిడితే.. తొక్కి పట్టి నారా తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. రాజ కీయాలు చేయడానికే తాను రాలేదని…. రాజ్యాంగ బద్దంగా హక్కు సాధించడానికి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. టి.వి ల ముందు తిడితే తాను భయపడిపోనని స్పష్టం చేశారు.
ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పవన్ కళ్యాణ్ అయ్యానని… గాంధీజీ స్ఫూర్తిగా తీసుకొని శ్రమధానం చేపట్టానని తెలిపారు. అలాగే..ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి పై మండి పడ్డారు పవన్ కళ్యాణ్. తన గురించి తెలిసి తప్పుగా మాట్లాడటం బాధాకరమని… ప్రశ్నిస్తేనే రోడ్ల పనులు చేపడతారా ? అని నిలదీశారు.
ప్రజలు ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయన్నారు. పోలీసులు నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడం దారుణమని.. నిరసన తెలపడం ప్రజల హక్కు అని తెలిపారు పవన్ కళ్యాణ్. రాజ్యాంగ హక్కులను కాల రాయొద్దని హెచ్చరించారు. రాజకీయం అనేది క్లిష్టమైన అంశమని… సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు పవన్.