ఎట్టకేలకు పవన్ కల్యాణ్ దూకుడుగా రాజకీయం చేయడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల ఫలితాల తర్వాత పవన్‌లో చాలా మార్పు కనిపిస్తోంది. ఇక ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అధికార వైసీపీ ఎన్ని అరాచకాలు చేసిన జనసేన 177 ఎంపిటిసిలు గెలిచిందని 2 జెడ్‌పిటిసిలు కూడా గెలిచిందని చెబుతున్నారు. అయితే ఈ మేర గెలవడం కూడా జనసేన శ్రేణులకు కాస్త ఊరటనిస్తుంది.
కాకపోతే పవన్ కల్యాణ్ కాస్త యాక్టివ్‌గా ఉంటే ఇంకా జనసేనకు మంచి ఫలితాలు వచ్చేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కల్యాణ్‌లో మార్పు రాలేదు… ఎప్పటిలాగానే పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేశారు… అప్పుడప్పుడు రాజకీయాలు చేశారు. దీని వల్ల జనసేనకు పావలా ఉపయోగం లేదు. ఒకవైపు ప్రతిపక్ష టిడిపి పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతుంది… అయినా సరే టిడిపి స్థానాన్ని తాను భర్తీ చేయాలని పవన్ ఎప్పుడు చూడలేదు.
ఏదో అప్పుడప్పుడు ఏపీకి వచ్చి రాజకీయం చేశారు..దీని వల్ల జనసేన పార్టీ బలోపేతం కాలేదు. కానీ ఏదైనా సమస్యపై పవన్ పోరాడితే మంచి స్పందన వస్తుంది. కాకపోతే ఎక్కువ సమస్యలు మీద పవన్ పోరాడలేదు. దీంతో జనసేన మళ్ళీ మూడో స్థానంలోనే కొనసాగుతుంది. ఇప్పుడు ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల ఫలితాల తర్వాత పవన్‌లో ఫైర్ పెరిగినట్లు కనిపిస్తోంది.
వైసీపీ అరాచకాలు చేయకపోతే జనసేన ఇంకా ఎక్కువ స్థానాల్లో గెలిచేది అని అంటున్నారు. మరి అరాచకాలు చేస్తుంటే పవన్ పోరాడితే సరిపోయేది. ఆ పని చేయకుండా ఇప్పుడు వైసీపీపై ఫైర్ అవ్వడం వల్ల ఉపయోగం లేదు. కానీ ఇకనుంచైనా పవన్ తన ఫైర్ చూపిస్తే జనసేన పికప్ అవ్వొచ్చని తెలుస్తోంది. అలాగే ఇంకా గట్టిగా కష్టపడితే చంద్రబాబు ప్లేస్‌ని పవన్ కల్యాణ్ రీప్లేస్ చేసే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి పవన్ రాజకీయం ఎలా ఉంటుందో?