మ‌హేష్ మ‌న‌సు గెలిచిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

-

క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేయడం..ఒక‌రి సినిమా వేడుక‌ల్లో మ‌రొక‌రు పాల్గొన‌డం అనేది ఈ మ‌ధ్య‌నే జ‌రుగుతుంది. బ‌హిరంగంగా ముందుకొచ్చి బాహాటంగా సినిమా ప్ర‌మోన్ల‌కు స‌హ‌క‌రిస్తున్నారు. కాలం తీసుకొచ్చిన మార్పు ఇది. ఒక‌ప్పుడు ఈ ప‌ద్ద‌తి ఉండేది కాదు. ఒక స్టార్ హీరో నోట మ‌రో స్టార్ హీరో గురించి వ‌చ్చేది కాదు. అంద‌రి క‌న్నా నేనే గొప్ప అన్న బేధం ఒక‌టి ఉండేది. ఎవ‌రికి వారే గొప్ప‌. ఈగో కూడా అదే స్థాయిలో చూపించేవారు. ఇక సినిమా ఇండ‌స్ర్టీ ని వేధిస్తోన్న పైర‌సీ గురించి చాలా రేర్ గా మాట్లాడేవారు. ప‌రిస్థితి త‌మ వ‌ర‌కూ వ‌స్తే త‌ప్ప లేదంటే? పైర‌సీ మాటే వ‌చ్చేది కాదు. అయితే ఆ ఒక్క విష‌యంలో మాత్రం మ‌హేష్ మ‌న‌సును ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెల‌చుకున్నాడు.

ఈ విష‌యాన్ని మ‌హేష్ సోద‌రి మంజుల ఓ ఇంట‌ర్వూలో తెలిపారు. అప్ప‌ట్లో మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా గుణ శేఖ‌ర్ దర్శ‌క‌త్వంలో అర్జున్ సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ స‌మ‌యంలో పైర‌సీకి గురై పెద్ద సంచ‌ల‌నే సృష్టించింది. అప్ప‌టి టిక్కెట్ ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్నా! అంత వెచ్చించి టిక్కెట్ కొన‌డం అనేది చిన్న విష‌యం కాదు. సినిమాను అభిమానులు మాత్ర‌మే ఎక్కువ‌గా చూసేవారు. సినిమా బాగున్నా లేకున్నా అభిమానంతో ఎదురు డ‌బ్బులిచ్చి మ‌రీ ఆడించేవారు. ఇక అర్జున్ అప్ప‌ట్లో యావ‌రేజ్ గా ఆడింది. భారీ లాభాలు తీసుకురాక‌పోయినా న‌ష్టాలైతే తెచ్చి పెట్టేలేదు. ఆ స‌మ‌యంలో టాలీవుడ్ హీరోల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క‌రే అర్జున్ సినిమా పైర‌సీ గురించి ప‌బ్లిక్ గా మాట్లాడార‌ని మంజుల తెలిపారు.

ఒక హీరో సినిమా గురించి మ‌రో హీరో మాట్లాడ‌టం అప్ప‌టివర‌కూ తాను చూడ‌లేద‌ని, అదే మొద‌టిసారని, అప్ప‌టి నుంచి ప‌వ‌న్ అంటే ప్ర‌త్యేక‌మైన అభిమానం ఏర్ప‌డింది అన్నారు. ఆ స‌మ‌యంలో మ‌హేష్ కుడా ప‌వ‌న్ అమేజింగ్ ప‌ర్స‌న్ అంటూ త‌న కుటుంబ స‌భ్యుల‌తో చెప్పారుట‌. ఇప్ప‌టికీ ఆ మాట‌ను గుర్తు చేసుకుని, ప‌వ‌న్ వ్య‌క్తిత్వం గురించి మాట్లాడుతుంటాడ‌ని మంజుల తెలిపింది. త‌ర్వాతి కాలంలో ప‌వ‌న్ దాతృహృదయం గురించి మ‌హేష్ మ‌రిన్ని విష‌యాలు తెలుసుకున్నాడుట‌. అప్ప‌టి నుంచి మ‌హేష్ కూడా ప‌వ‌న్ అంటే ప్రేమాభిమానాలు చూపిస్తాడ‌ని మంజుల తెలిపింది. ద‌టీజ్ ప‌వ‌ర్ స్టార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version