ఏ నిర్మాతైనా సినిమా నిర్మాణంలో ఖర్చు తగ్గించడానికే చూస్తాడు. మంచి నీళ్లలా ఖర్చు చేయడానికి ఎవరూ ఒప్పుకోరు. ఖర్చు పెట్టాల్సిన చోట పెడతారు. పొదుపు చేయాల్సిన చోట చేస్తారు. అక్కడా కూడా డబ్బును గాలికి వదిలేస్తే ప్రొడక్షన్స్ ఖర్చు తడిపి మోపుడు అవుతుంది. అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నయనతార ఉయ్యాల వాడ భార్య పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకమైనది. దీంతో సైరా కోసం అమ్మడు బల్క్ గా డేట్లు కేటాయించింది. ఆమె పాత్ర చిత్రీకరణ పూర్తయ్యే వరకూ మధ్యలో వేరే కమిట్ మెంట్లు పెట్టుకోకూడదనే ముందుగానే అగ్రిమెంట్ రాజుకున్నారు.
దాని ప్రకారమే ఆమె షూట్ లో పాల్గొన్ని పూర్తిచేసింది. నయనతార ఎంతో బిజీగా ఉన్నా సైరా కథ కావడం..చిరు సరసన ఛాన్స్ కావడంతో మిస్ చేసుకోలేదు. వేరే కమిట్ మెంట్లను సైతం పక్కనబెట్టి కాల్ షీట్లు సర్దుబాటు చేసింది. ఈ నేపత్యంలో చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఆమెకు అడిగిన దానికన్నా కాస్త ఎక్కువగానే ఇచ్చారని వినిపిస్తోంది. ఆమె మార్కెట్ ప్రకారం మహా అయితే రెండు కోట్లు ఇచ్చి ఉంటారు. ఇంకా హోటల్, ప్లైట్ ఖర్చులు అదనంగా ప్రతీ హీరోయి న్ కేటాయించినట్లే ఇచ్చారు. అయితే ఇవిగాక అదనంగా మరో 50 లక్షలు పారితోషికంగా ఛార్జ్ చేసిందిట. ఆమె సన్నివేశాల చిత్రీకరణ అనుకున్న తేదీల్లో పూర్తికాకపోవడంతోనే అదనంగా చెర్రీ చెల్లించాల్సి వచ్చిందిట.
ఈ విషయాన్ని మీడియా మరోలా హైలైట్ చేస్తోందని అంటున్నారు. రామ్ చరణ్ ఆమె పనితనాన్ని మెచ్చి అదనంగా 50లక్షలు ఇచ్చాడని ప్రచారం సాగుతోంది. అందులో ఎంత మాత్రం వాస్తవం లేదని కొన్ని సోర్సెస్ ద్వారా తెలిసింది. నయన్ పనికి తగ్గ పారితోషికమే తీసుకుంది తప్ప అదనంగా ఛార్జ్ చేయలేని ఆమె సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. ఏది ఏమైనా సైరా చిత్రీకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ 2న సినిమా విడుదల చేయనున్నారు.