పవన్..కంచుకోట ఎక్కడ?

-

సినిమాల్లో సక్సెస్ అయిన పవన్ కల్యాణ్…రాజకీయాల్లో విజయం అందుకోవడానికి కష్టపడుతున్నారు. తొలి ప్రయత్నంలోనే విఫలమైన…మలి ప్రయత్నంలో మాత్రం సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు. అలా సక్సెస్ అవ్వాలంటే పవన్ కల్యాణ్ కు కూడా ఒక కంచుకోట కావాలి.. జగన్ కు పులివెందుల…చంద్రబాబుకు కుప్పం మాదిరిగా…పవన్ కల్యాణ్ కు విజయాలు అందించే నియోజకవర్గం కావాలి.

అయితే ఇప్పటికీ పవన్ కు అలాంటి నియోజకవర్గం దొరికినట్లు కనబడటం లేదు..పోనీ ఏదైనా నియోజకవర్గాన్ని ఎంచుకుని దాన్ని కంచుకోటగా మార్చుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. రాష్ట్రంలో జనసేనకు పూర్తి స్థాయిలో బలం లేదు..అందుకే ఇప్పుడు పవన్…పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. కాకపోతే పవన్ మరోక పని కూడా చేయాలి…పార్టీని బలోపేతం చేసే సమయంలోనే తాను కూడా బలపడాలి. తనకంటూ ఒక బలమైన నియోజకవర్గం కావాలి. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరంల్లో పవన్ ఓడిపోయారు.

ఇక వచ్చే ఎన్నికల్లో ఆ రెండిటిల్లో పవన్ పోటీ చేస్తారా? లేక అందులో ఒక చోట పోటీ చేస్తారా? అది కాదు అంటే వేరే చోట పోటీ చేస్తారా? ఏ విషయం కూడా క్లారిటీ లేదు. ఎన్నికల సమయంలో సీటు ఫిక్స్ చేసుకుంటే గెలుపు అనేది చాలా కష్టమవుతుంది..కాబట్టి ఇప్పుడే ఒక సీటుని ఫిక్స్ చేసుకుని, అక్కడ పవన్ బలం పెంచుకోవాలి. వరుసగా ఏడు సార్లు గెలిచిన చంద్రబాబే…కుప్పంపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకుంటూనే మరోవైపు…కుప్పంలో తన బలాన్ని పెంచుకుంటున్నారు.

ఎందుకంటే గత ఎన్నికల్లో కుప్పంలో బాబుకు మెజారిటీ తగ్గింది..పైగా స్థానిక ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ చిత్తుగా ఓడింది..దీంతో బాబు అలెర్ట్ అయ్యారు…కుప్పంలో పరిస్తితులని చక్కదిద్దుకుంటున్నారు…మళ్ళీ మంచి మెజారిటీతో గెలిచేందుకు కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన బాబు అలా చేస్తున్నారంటే…ఈ మధ్యే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఎంత చేయాలి. సినిమా అభిమానుల బలాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తే దెబ్బతినాల్సి వస్తుంది. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నారు…మళ్ళీ దెబ్బతినకుండా ఉండాలంటే అర్జెంట్ గా ఒక కంచుకోటని వెతుక్కోవాలి…లేదా ఏదొక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుని కంచుకోటగా మార్చుకోవాలి. అప్పుడే పవన్ కు ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version