“ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్”

-

తమిళనాడు యువ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఏకంగా ఒక స్వామిజి అయితే హిందూ మతాన్ని ఇంతలా దూషించిన స్టాలిన్ తల నరికితే రూ. 10 కోట్లు ఇస్తానని ప్రకటించి సంచలనాన్ని సృష్టించాడు. ఇక దీనికి ఉదయనిధి స్టాలిన్ సైతం రండి ఎవరు వస్తారో నా తల కోసం అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక రోజూ ఈ విషయంపై ఎవరో ఒకరు కామెంట్ చేయడం మళ్ళీ దానికి ఉదయనిధి స్టాలిన్ సమాధానం ఒక రేంజ్ లో ఇవ్వడం చూస్తూనే ఉన్నాము. ఇక తాజాగా కేరళ కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. ఈయన మాట్లాడుతూ .. సనాతన హిందూ ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితుల్లో సమర్ధించే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ప్రజల కోసమే ఉన్న కాంగ్రెస్ అన్ని కులాల, మతాలను సమానంగా చూస్తుందని చెప్పారు పవన్ ఖేరా.

ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించడం లేదంటే ఖండించినట్లే అని పవన్ ఖేరా ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version