జో బైడెన్ కోసం బాంబు దాడులను కూడా తట్టుకునే “ది బీస్ట్” కారు !

-

ఇండియా రాజధాని అయిన ఢిల్లీ లో జీ20 సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల కోసం ఢిల్లీ నగరం ఎంతో వైభవంగా సిద్ధమవుతోంది. కాగా అమరిక అధ్యక్షుడు జో బైడెన్ సైతం హాజరు కానుండడంతో ఆయనకు ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం అమెరికా నుండి ఫ్లైట్ లో రానున్న జో బైడెన్ కు ఢిల్లీ వీధుల్లో తిరగడానికి అనుకూలంగా మరియు రక్షణగా ఉండడానికి ది బీస్ట్ ను రంగంలోకి దించింది అమెరికా రక్షక దళం. ది బీస్ట్ అని చెప్పుకుంటున్న ఈ కారులో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఈ కారుపై బాంబులతో దాడి చేసినా ఏమీ కాదు.. కెమికల్ మరియు జీవాయుధా దాడులను కూడా సమర్థవంతంగా తట్టుకుని లోపల ఉన్న వారికి రక్షణ కల్పిస్తుంది. అన్నటినీ తట్టుకునే విధంగా తయారుచేశారు.

ఇక ఈ కారును వేరే వాహనము గుద్దినా దీనికి ఏమీ కాదు.. ఇంధన ట్యాంక్ పేలకపోవడమే కాదు… టైర్స్ ఫంచర్ కావు మరియు పగలవు. ఒకవేళ టైర్స్ కనుక డామేజ్ అయితే రిమ్ములతోనే ప్రయాణం చేయగల సామర్ధ్యం ఉంది. ఇంకా ఈ కారులో జో బైడెన్ బ్లడ్ గ్రూప్ పాకెట్ లు సిద్ధంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version