సంక్రాంతి బరిలో పవన్ బీమ్లానాయక్.. అతి త్వరలో మరో సర్ ప్రైజ్

-

హైదరాబాద్: పవర్ స్టార్  పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం బీమ్లానాయక్ నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. సింగర్ శ్రీకృష్ణ పాడుతున్న తొలి సింగిల్ పాటకు థమన్ బాణీలు అందిస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన ట్యూన్‌ను హీరో పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు ఈ సినిమా దర్శకుడు సాగర్ కే. చంద్ర దగ్గరుండి మరీ విన్నారు. ఇలా ఈ ముగ్గురు కలిసి పాట ట్యూన్‌ను వింటున్న వీడియోను చిత్ర యూనిట్ ప్రేక్షకులకు అందజేశారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు.

అయితే ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా విడుదల డేట్‌ను ప్రకటించారు. ఈ మూవీలో పవన్ కల్యాణ్ తో పాటు మరో హీరో, విలన్ రానా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల రచయిగా త్రివిక్రమ్ వ్యవహరిస్తున్నారు. దీంతో సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాల్లోనూ ఆయన విధిగా ఉంటున్నారు. ఎలాగైనా సరే ఈ చిత్రాన్ని బిగ్ హిట్ చేసి పవన్ కల్యాణ్‌కు మరో గిఫ్ట్ ఇవ్వాలని పట్టుతో ఉన్నారు.

ఇప్పటికే ఈ చిత్రం 40 శాతం షూటింగ్ పూర్తి అయింది. ఈ చిత్రం నుంచి విడుదలైన మేకింగ్ వీడియాలకు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళం మూవీ అయ్యప్పునుమ్ కోషియంకు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news