ఏపీలో పొత్తులపై ఇంకా క్లారిటీ రావడం లేదు..ఓ వైపు టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని, మరోవైపు బిజేపి-జనసేన కలిసి పోటీ చేస్తాయని ఏ మాత్రం క్లారిటీ లేకుండా ప్రచారం నడుస్తోంది. అయితే ఇక్కడ క్లారిటీగా లేనిది పవన్ మాత్రమే అంటున్నారు. ఎందుకంటే టీడీపీ పక్కగా జనసేనతో కలిసి ముందుకెళ్లాలని చూస్తుంది. కానీ టీడీపీతో కలిసేది లేదని బిజేపి అంటుంది. కానీ బిజేపితో జనసేన పొత్తులో ఉంది. అలాంటప్పుడు పవన్..బిజేపిని ఒప్పించి టీడీపీతో కలవాలి. లేదా బిజేపిని వదిలేయాలి..అది కాదు అంటే టిడిపిని పక్కన పెట్టాలి.
కానీ పవన్ ఏం చేస్తారో క్లారిటీ రావడం లేదు. అదే సమయంలో సీఎం సీటు విషయంలో కూడా పవన్ క్లారిటీ ఇస్తున్నారో..కన్ఫ్యూజ్ చేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది. టీడీపీతో పొత్తు ఉంటే పవన్‌కు సీఎం సీటు దక్కే ప్రసక్తి లేదు..రియాలిటీ ఆలోచిస్తే అదే జరుగుతుంది. అయితే జనసేన శ్రేణులు మాత్రం పొత్తు ఉంటే పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ మాత్రం ఒకోసారి ప్రజలు ఆశీర్వదిస్తే సీఎంని అవుతానని అంటారు..మళ్ళీ సీఎం సీటు లేకపోయినా ప్రజలకు సేవ చేస్తానని, అధికారంలోకి వచ్చాక పనులు చేయిస్తానని అంటున్నారు.
అంటే సీఎం సీటు కావాలో వద్దో అనేది పవన్‌కే తెలియట్లేదని అంటున్నారు. అయితే ఇక్కడ సమీకరణం ఒక్కటే..బిజేపి-జనసేన పొత్తు ఉంటే పవన్ సీఎం అభ్యర్ధి. కానీ బిజేపి-జనసేన కలిసి అధికారంలోకి రావడం అనేది జరిగే పని కాదు. ఇక టీడీపీ-జనసేన పొత్తు ఉంటే పవన్‌కు సీఎం సీటు దక్కే ఛాన్స్ లేదు. టీడీపీ సైతం సీఎం సీటు వదులుకుని పొత్తుకు ముందుకు రావడం కష్టం. కాబట్టి ఎటు వచ్చిన ఈ సారి మాత్రం పవన్‌కు సీఎం సీటు దక్కే అవకాశం కనిపించడం లేదు.