పవన్ సర్పంచ్..రోజాకు ఛాన్స్ లేదే..!

-

ప్రత్యర్ధులపై విరుచుకుపడటంలో మంత్రి రోజా ఎప్పుడు ముందే ఉంటారని చెప్పొచ్చు. అధికార వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నేతల్లో రోజా ముందు వరుసలో ఉంటారు. ఇక రోజా..ఏ స్థాయిలో చంద్రబాబుపై విమర్శలు చేస్తారో చెప్పాల్సిన పని లేదు. అలాగే లోకేష్, పవన్ కల్యాణ్ టార్గెట్‌గా కూడా రోజా చెలరేగిపోతారు. తనదైన శైలిలో విమర్శలు చేస్తారు. తాజాగా పవన్..వైసీపీకి 45-67 సీట్లు మాత్రమే వస్తాయని, నెక్స్ట్ వైసీపీ గెలవదని మాట్లాడారు.

దీనికి కౌంటరుగా రోజా మాట్లాడుతూ..దమ్ముంటే పవన్ ఎమ్మెల్యేగా గెలవాలని, అసలు ముందు సర్పంచ్‌గా గెలిచి రావాలని, ఇక 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు. అలాగే రైతు సమస్యలపై అసెంబ్లీ బయట నిరసన తెలియజేసిన లోకేష్‌పై కూడా ఫైర్ అయ్యారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ లోకేష్ అని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు…లోకేష్‌ని ఎమ్మెల్సీ చేసి, మాత్రిని చేశారని విమర్శించారు. మొత్తం మీద లోకేష్, పవన్‌లు ఎమ్మెల్యేలుగా గెలవలేరంటూ ఫైర్ అయ్యారు.

అయితే రోజాకు టీడీపీ-జనసేన శ్రేణుల నుంచి కూడా భారీగా కౌంటర్లు వస్తున్నాయి. రాజకీయాల్లో గెలుపోటములు మామూలే అని..అలా అని ఓడిపోయిన వారు మళ్ళీ ఎప్పటికీ గెలవలేరన్నట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని, గతంలో ఎన్టీఆర్ ఓడిపోయారని, ఇక జగన్ తల్లి విజయమ్మ, బాబాయ్ వివేకానందరెడ్డి కూడా ఓడిపోయారని..అంత ఎందుకు రోజా గతంలో రెండుసార్లు ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు.

కాబట్టి రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవని నెక్స్ట్ ఎన్నికల్లో పవన్-లోకేష్‌లకు గెలిచే ఛాన్స్ రావొచ్చని అంటున్నారు. ఇక నెక్స్ట్ నగరిలో మళ్ళీ రోజా గెలిచి చూపించాలని టీడీపీ శ్రేణులు సవాల్ విసురుతున్నాయి. నగరిలో రోజాని సొంత పార్టీ వాళ్లే ఓడిస్తారని…కాబట్టి పవన్-లోకేష్‌లు గెలుస్తారో లేదో పక్కన పెట్టి..ముందు రోజా గెలుస్తారో లేదో చూసుకోవాలని అంటున్నారు. ఈ సారి నగరిలో రోజాకు గెలిచే ఛాన్స్ లేదని మాట్లాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version