ఐపీఎల్ తరహాలోనే…. దక్షిణాఫ్రికా ప్రీమియర్ లీగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో జరిగే ఆరంభ ప్రీమియర్ లీగ్ కు ఆటగాళ్ల వేలం తాజాగా ప్రారంభమైంది. 2023 జనవరిలో జరిగే తొలి దక్షిణాఫ్రికా ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ప్రతి ఫ్రాంచైజీ తప్పనిసరిగా 17 మంది జట్టు సభ్యులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఇందులో ఐదుగురు అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉండాలి. ముగ్గురు అంతర్జాతీయ, ఇద్దరు స్వదేశీ ఆటగాళ్లు తప్పనిసరి. మిగిలిన ఆటగాళ్లు దేశీయ ఆటగాళ్లయి ఉండాలి. ఐపిఎల్ తర్వాత జరిగే రెండో అతిపెద్ద సంగ్రామం దక్షిణాఫ్రికా లీగ్ మాత్రమే.
ఈ లీగ్ లో ఆడే ఆరు ఫ్రాంచైజీలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ యజమానుల చేతిలో ఉండడం విశేషం. కేప్ టౌన్ సిటీ, జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ , పార్లు రాయల్స్, పెట్రో రియర్ క్యాపిటల్స్, ఈస్ట్రన్ కేప్, మరో జట్టు పేరు ప్రకటించాల్సి ఉంది. ఆ జట్టును లక్నో సూపర్ జెయింట్స్ యజమానిగా వ్యవహరించనున్నాయి. ఇక మొత్తం 533 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటుండగా, అందులో 248 మంది దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్లే. మిగిలిన వాళ్ళు విదేశీ క్రికెటర్లు.