పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు..ఈ సారి సేవే ముఖ్య అతిథి : నాగ బాబు

-

సెప్టెంబర్ 2 న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వినూత్న కార్యక్రమం చేపట్టనున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కష్ట సమయంలో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఆక్సిజన్ మాస్క్, ఆక్సీ మీటర్ అందజేయనున్నట్లు జన సేన పార్టీ అధినేత సోదరుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. పేదవాళ్ల ప్రాణాలను నిలబడదాం అనే అంశంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Nagababu Pawan Kalyan JSP

ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి డొనేషన్ లు ఇవ్వాలనుకునే వారు ఇవ్వొచ్చని నాగబాబు తెలిపారు. ఆగస్టు 27న నుంచి జన్మదినం వారోత్సవాలు మొదలవుతాయని తెలిపారు. మనిషి మరణించిన తర్వాత సహాయం కన్నా…బ్రతికి ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి వారి జీవితాలను మరింత ముందుకు సాగేలా చేయడం ముఖ్యమని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని ఆ పార్టీ నేతలు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version