తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్బావ వార్షికోత్సవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం మంగళగిరిలోని ఎన్టీఆర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాలోకేశ్, కొందరు తెలుగుదేశం సీనియర్ నేతలు, కార్యకర్తల సమక్షంలో వేడుకలు జరిగాయి.
ముందుగా సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అనంతరం మంత్రి నారాలోకేశ్ మాట్లాడుతూ..‘మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు – ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు. జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉంది.కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడూ స్వార్థానికి వాడుకోలేదు.రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పిన ఏకైక పార్టీ టీడీపీ’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.