ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని గోగుండ కొండల్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. గోగుండ కొండపై ఉపంపల్లిలో ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ‘మావోయిస్టులపై మరో దాడి జరిగింది. సుక్మాలో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు 16 మందిని మట్టుబెట్టి, భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మోదీ నాయకత్వంలో 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలని నిర్ణయించాము.’ అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.