వీటికి దూరంగా ఉండడమే మంచిది: పాయల్

-

ప్రముఖ నటి పాయల్ రాజ్పుత్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చింది. బోల్ట్ నటనతో ఫుల్ క్రేజ్ ని తెచ్చుకుంది. పలు సినిమాలలో నటించినా పెద్దగా హిట్ అయితే అందుకోలేదు. గత ఏడాది మంగళవారం మూవీతో హిట్ అందుకుని బాక్సాఫీస్ ని షేర్ చేసేసింది. పాయల్ రాజ్పుత్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని కూడా పంచుకుంటూ ఉంటుంది పాయల్ రాజ్పుత్ ఇంస్టాగ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఎవరైతే మిమ్మల్ని కిందకి లాగేందుకు ప్రయత్నిస్తారో అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. అలానే పరిష్కారం సాధ్యం కానీ సమస్యలకి దూరంగా వెళ్ళండి. మీ ఎదుగుదలని చూసి ఓర్వలేని వారిని దూరంగా పెట్టండి మీకు ఏదైతే హానికరంగా భావిస్తారో వాటికి దూరంగా ఉండాలి అదే మంచిది అని పాయల్ చెప్పారు. అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిది కాదు కనుక వారందరికీ అన్నిటికీ దూరంగా ఉంటేనే మంచిది అని ఆమె పోస్ట్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news