కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. స్పీకర్ విశ్వాస పరీక్ష చేపడితే కుమారస్వామి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. ష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. రాజధాని బెంగళూరులో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. సభలో మెజార్టీకి కావాల్సిన సంఖ్యా బలం 103 కాగా, బీజేపీకి 105 మంది, కాంగ్రెస్-జేడీఎస్‌లకి 101 మాత్రమే ఉండటంతో విశ్వాస పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోనుంది.
అయితే ఆ 101 మంది సభ్యుల్లో ఇద్దరు స్పీకర్, నామినేడ్ సభ్యులను మినహాయిస్తే కుమార స్వామి ప్రభుత్వం సంఖ్య 99 కానుంది. సభకు గైర్హాజరు అయిన వారిలో 15 మంది రెబల్స్, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అనారోగ్యంతో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభకు హాజరుకాలేదు.
అధికార పక్షం నుండి కొందరు సభ్యులు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారన్నది తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్య మంత్రి సిద్దరామయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ, 25 కోట్ల నుంచి 50 కోట్ల వరకు బీజేపీ నేతలు వెచ్చించారని, రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా పార్టీకి వెన్నుపోటు పోడిచిన తిరుగుబాటు దారులపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.