ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోడీకి అసెంబ్లీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పాయల్ శంకర్. ఎన్నో ఏండ్ల కల ఎస్సీ వర్గీకరణ నేడు సహాకరమైంది. సుప్రీం కోర్టు వరకే పరిమితం అవుతుందనుకున్న వర్గీకరణ నేడు ఫలించింది. నాడు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. నేడు కూడా వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. వర్గీకరణ కోసం నాడు మందకృష్ణ చేసిన ఉద్యమానికి ఎన్నో అవహేళనలు, అవరోధాలు ఎదురయ్యాయి. ఆయన పోరాటానికి నేడు ప్రతిఫలం దక్కింది.
బీజేపీ చొరవ వల్లే సుప్రీమ్ కోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం అయ్యింది. గ్రూప్ 123 లుగా కాకుండా AbC లుగా ఉండాలని ఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆవైపుగా దృష్టి పెట్టాలని కోరుతున్నాం. గ్రూప్ 123 ల వల్ల ఎస్సీ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. అసంతృప్తితో ఉన్న ఆయా వర్గాలని పిలిచి చర్చలు చేయాలని కోరుతున్న. గ్రూప్ 123 ల విభజన వల్ల ఎస్సీ వర్గాలు సంతృప్తిలో లేరు. వర్గీకరణ వల్ల ఎస్సీ సామాజిక వర్గాల బ్రతుకులో సంపూర్ణ మార్పులు రావాలి. సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా ఉపయోగించుకోకపోతే అధికారులపై చర్యలు తీసుకునేందుకు చట్టాల్లో మార్పులు తేవాలి. సబ్ ప్లాన్ నిధులు వ్పూర్తి స్థాయిలో ఖర్చు కావడంలేదు.. వర్గీకరణతో ఎస్సీ వ్రగాలకు సామాజిక న్యాయం సమానంగా జరగాలంటే సమూలంగా మార్పులు జరగాలిసిన అవసరం ఉంది. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ పాత్ర ఏంటో అందరికీ తెలుసు. ఎస్సీల కల సాహాకారం కావడంలో మోడీ ప్రధాన పాత్ర పోషించారు అని పాయల్ శంకర్ అన్నారు.