దేశ రాజకీయాల్లో శిఖరం లాంటి వ్యక్తిని జైల్లో చూసి బాధనిపించింది :పయ్యావుల కేశవ్

-

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. జైలులో ఉన్న చంద్రబాబుతో ఇవాళ నారా భువనేశ్వరి, బ్రహ్మణితో పాటు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ములాఖత్‌ అయ్యారు. ములాఖత్‌ అనంతరం పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో శిఖరం లాంటి వ్యక్తిని జైల్లో చూసి బాధనిపించిందన్నారు. చేయని తప్పుకు శిక్ష వేశారని, కృష్ణా జలాలపై పార్టీ యంత్రాంగం స్లోగా ఉంది మీరందరూ చొరవ చూపట్లేదు రాష్ట్రానికి చాలా నష్టం కలుగుతుందని చెప్పారన్నారు కేశవ్‌.

అంతేకాకుండా.. ‘ప్రత్యర్థుల మానసంగా రాజకీయంగా దెబ్బతీయాలనుకున్నారు అయితే ఆయన మరింత బలంగా తయారయ్యాడు… రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను మీడియా ద్వారా తెలుసుకుంటున్నాడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాడు… ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయమన్నారు. ఎక్కడ కేసులు గురించి ఆలోచించడం లేదు ఇవాళ కాకపోతే రేపు బయటికి వస్తాను ఆలోచనతో ఉన్నారు.. ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ చేసి మాకు ధైర్యం వచ్చింది. ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రాజెక్టుల విషయంలో సమరభేరి పూరించారు.

 

ఇరిగేషన్ రంగంలో ప్రస్తుత ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది… దాన్ని ఎత్తి చూపించినందుకే అక్రమ కేసుల్లో అరెస్టు చేశారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు రాజకీయంగా బలంగా ఉన్న టిడిపిని దెబ్బతీయడానికి ఈ ప్రయత్నం చేసింది. చంద్రబాబు మద్దతుగా 54 దేశాల్లో జనం ఆందోళన చేశారు. చంద్రబాబు వెనకాల లక్షల మంది జనం ఉన్నారు. అవినీతి జరగలేదు కక్షపూరితంగానే చంద్రబాబును అరెస్టు చేశారని జనం నమ్ముతున్నారు.. ఈ రాష్ట్రానికి జగన్ అవసరం లేదు…. ఏపీ హేట్స్ జగన్. నిక్కరేసుకున్న కుర్రోడు కూడా చెబుతాడు… కక్షపూరితంగా చంద్రబాబునాయుడుని అరెస్టు చేశారని…. పవన్ కళ్యాణ్ పై మానసికంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు… బాబు భద్రత వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది…. తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని , కోర్టులను కోరుతాం.’ అని పయ్యవుల కేశవ్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version