చంద్రబాబు ఒక్కరోజు దిల్లీలో ఉంటేనే వైకాపా ఉలిక్కిపడుతోంది: పయ్యావుల

-

తెదేపా అధినేత చంద్రబాబు ఒక్క రోజు దిల్లీలో ఉంటే వైకాపా ఎందుకో ఉలిక్కి పడుతోందని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. దిల్లీ పర్యటనపై తెదేపా కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.

‘‘తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనతో దిల్లీలో వైకాపా చేస్తున్న అసత్య ప్రచారాలు సగం కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి నిరభ్యంతరంగా తీసుకురావొచ్చని రాష్ట్రపతి సూచించారు. సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు దిల్లీ వెళ్లారు. మా పార్టీ అధినేతను దిల్లీలో అన్ని పార్టీల నేతలు, ప్రభుత్వ పెద్దలు బాగా స్వాగతించారు. రాష్ట్రపతితో భేటీ అద్భుతంగా జరిగింది. ఆమె ఒక తల్లిలా మాతో మాట్లాడారు. రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఎంపిక నూటికి నూరు శాతం మంచి నిర్ణయమని ఆమెను కలిశాక వ్యక్తిగతంగా మరింత స్పష్టత వచ్చింది. ప్రత్యేకంగా పొలిట్‌బ్యూరోలో చర్చించి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. ఇది చాలా ఉన్నతమైన కార్యక్రమం’’ అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version