ఎడిట్ నోట్: సెమీఫైనల్…!

-

ఏ క్రీడలోనైనా…ఫైనల్ మ్యాచ్ ఎంత ముఖ్యమో సెమీ ఫైనల్ మ్యాచ్ కూడా అంత ముఖ్యమని చెప్పాలి….సెమీ ఫైనల్ లో గెలిస్తేనే ఫైనల్ లో ఆడగలిగేది…అలాగే ఫైనల్ లో గెలిచి కప్ కొట్టేది.  సెమీ ఫైనల్ లో గెలవకుండా ఫైనల్ కు వెళ్ళడం సాధ్యపడని విషయం. అయితే రాజకీయాల్లో కూడా ఇలా రంజుగా ఉండే మ్యాచ్ లు బాగానే జరుగుతాయి..కాకపోతే అది పోలిటికల్ గేమ్ మాత్రమే.

ఈ గేమ్ లో నెగ్గాలని ప్రతి రాజకీయ పార్టీ కోరుకుంటుంది. గెలవడానికి వ్యూహ ప్రతివ్యూహాలు పన్ని రాజకీయంగా పై చేయి సాధించడానికి చూస్తాయి. అలాగే అసలు ఎన్నికలు జరగకముందు…జరిగే ఎన్నికల్లో సత్తా చాటి…చివరికి మెయిన్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తాయి. ఇప్పుడు తెలంగాణలో ప్రధాన పార్టీలు అదే పనిలో ఉన్నాయి…తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయి…లేక సమయం ప్రకారమే జరుగుతాయా? అనే విషయాలని పక్కన పెడితే..ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల యుద్ధ వాతావరణం నడుస్తోంది. సాధారణ ఎన్నికలకు సమయం కూడా దగ్గర పడుతుంది.

దీంతో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా రాజకీయం నడుపుతున్నాయి. పూర్తిగా పార్టీల దృష్టి ఎన్నికలపైనే ఉంది. అయితే మెయిన్ ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో మునుగోడు ఉపఎన్నిక ఒక సెమీ ఫైనల్ మాదిరిగా వచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి…స్పీకర్ చేత ఆమోదింపజేసుకున్నారు కూడా.

ఈ క్రమంలో మునుగోడు ఉపఎన్నిక ఫిక్స్ అయింది. అయితే ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు అయితే..మునుగోడు ఒక ఎత్తు అని చెప్పొచ్చు. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో జరగనున్న మునుగోడు ఉపఎన్నికలో వచ్చే ప్రజా తీర్పు బట్టే…అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఉంటుందని అంతా భావిస్తున్నారు. అందుకే ఈ ఉపఎన్నికలో గెలవడానికి మూడు పార్టీలు సర్వశక్తులు ఒడ్డనున్నాయి.

వాస్తవానికి మునుగోడు తీర్పుకు దాదాపు దగ్గరగానే అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు వచ్చే ఛాన్స్ ఉండటం వల్లే..ఇప్పుడు మునుగోడు ఒక సెమీ ఫైనల్ మాదిరిగా తయారైంది. అయితే ఈ సెమీఫైనల్ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? అంటే చెప్పడానికి వీలు కాని విధంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రాంతాల బట్టి, పరిస్తితులని బట్టి ప్రజల తీర్పు మారిపోతుంది. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటే..దుబ్బాక, హుజూరాబాద్ లో బీజేపీకి అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఇప్పుడు మునుగోడులో తీర్పు ఎలా వస్తుందో అర్ధం కాకుండా ఉంది..ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీకి బలం ఉంది…2014లో ఈ సీటు టీఆర్ఎస్ గెలుచుకుంది. అలాగే బలమైన క్యాడర్ ఉంది..అధికార బలం ఉంది. ఇక బలమైన అభ్యర్ధిని పెడితే టీఆర్ఎస్ పార్టీకి మునుగోడులో అడ్వాంటేజ్ ఉంటుంది. అటు మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ సీటు…అలాగే కంచుకోట కూడా. ఎక్కువసార్లు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది..బలమైన క్యాడర్ ఉంది..సరైన అభ్యర్ధిని పెడితే కాంగ్రెస్ బలం పెరుగుతుంది.

ఇక ఇక్కడ బీజేపీకి ఉన్న ఏకైక బలం రాజగోపాల్ రెడ్డి ఇమేజ్..అలాగే నియోజకవర్గంలో ఉన్న ఫాలోయింగ్…ఆర్ధికంగా బలంగా ఉండటం…అటు తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ ఉండటం, కేంద్రంలోని పెద్దల అండ, రాష్ట్ర బీజేపీ నేతల కష్టం తోడైతే రాజగోపాల్ కు తిరుగుండదు. మరి చూడాలి మునుగోడు సెమీ ఫైనల్ లో ఎవరు గెలిచి…ఫైనల్ రేసులో ముందు ఉంటారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version