నయనతార – విగ్నేష్ శివన్ పెళ్లి ప్రోమో వైరల్..!

-

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ కు గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఎట్టకేలకు తాను ప్రేమించిన ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ఈ ఏడాది జూన్ 9వ తేదీన మహాబలిపురంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత తిరుమల కొండకు చేరుకొని స్వామివారిని జంటగా దర్శించుకున్నారు. ఇకపోతే వివాహం ఎలా జరిగింది? అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదని చెప్పాలి. ఎందుకంటే వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు మాత్రమే వైరల్ అయ్యాయి. కానీ ఎలా జరిగింది అని తెలుసుకోవాలని అభిమానుల సైతం ఆతృతగా ఎదురు చూశారు. ఇక నయనతార విగ్నేష్ తమ పెళ్ళికి సంబంధించిన వీడియో డిజిటల్ రైట్స్ ను అత్యంత భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లెక్స్ సొంతం చేసుకుంది.

ఇక తాజాగా మ్యారేజ్ కి ముందు తీసుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రోమో ను నెట్ ఫ్లెక్స్ తాజాగా రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ ప్రోమో అప్డేట్ వదలడంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నెట్ ఫ్లెక్స్ వారు ..”నయంతార బియాండ్ ది ఫెయిరీటేల్” పేరిట టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ఇందులో నయనతార విగ్నేష్ శివన్ ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందనే విషయాలను పంచుకున్నారు. ముందుగా నయనతార మాట్లాడుతూ.. తనమీద విగ్నేష్ కు ఉన్న ప్రేమను కచ్చితంగా తెలుసుకున్నాను అంటూ ఆమె తెలిపింది.

విగ్నేష్ శివన్ కూడా మాట్లాడుతూ.. నయనతార స్వభావంతో తాను ప్రేమలో పడ్డానని, ఆమె క్యారెక్టర్ ఆదర్శంగా ఉంటుందని , ఇక అందం బయట మాత్రమే కాదు లోపల కూడా ఉంటుందని వివరించారు. ఇకపోతే ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు చాలా ఆతృతగా వెడ్డింగ్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. ఇక త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన విజువల్స్ నెట్ ఫిక్స్ లో ప్రసారం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version