కుట్రపూరితంగానే అక్రమ కేసులు పెట్టారు : పయ్యావుల

-

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు అరెస్టుపై.. ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మంగళవారం ఆరోపించారు. కుట్రపూరితంగానే శరత్ అసోసియేషన్‌తో తప్పుడు నివేదికలు తెప్పించుకొని అక్రమ కేసులు పెట్టారన్నారు పయ్యావుల కేశవ్. తమ పార్టీ అధినేతను అరెస్ట్ చేసినందుకు గాను వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ఆత్మరక్షణలో పడిందన్నారు పయ్యావుల కేశవ్. ఈ కేసుకు సంబంధించి అధికారులను విచారించకుండా చంద్రబాబుపై మాత్రమే ఎలా ఆరోపణలు చేస్తారని పయ్యావుల కేశవ్ నిలదీశారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి 42 కేంద్రాలకు ఇందుకు సంబంధించి సామాగ్రిని సరఫరా చేసామని, విచారణ జరిపి నివేదిక
ఇవ్వాలని డిమాండ్ చేశారు. 42 స్కిల్ కేంద్రాల్లో ఉన్న ఎక్విప్‌మెంట్స్ చూపిస్తూ వీడియోలు చూపిస్తామని, ఏ ఎక్విప్‌మెంట్ అడిగితే అది సెంటర్లలో కనిపిస్తుందన్నారు. సీమెన్స్ కంపెనీ అద్భుత పనితీరును కనబరిచిందని నివేదికలు వచ్చాయన్నారు. ఫైబర్ గ్రిడ్‌లో ప్రతి విషయాన్ని ఐఏఎస్ అధికారులతో కూడిన హైపర్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. అందులోను ఎలాంటి అవినీతి లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version