BREAKING : పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్

-

తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద… ఆయనను అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఉదయం నుంచి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కాపు కాసిన… పోలీసులు… కాసేపటికి తన అరెస్టు చేశారు.

ఈరోజు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో నిరసన కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిరసన కార్య క్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు.

రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఈ అరెస్ట్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అరాచక పాలనను అంతమొందించి వరకు తమ పోరాటం ఆగదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కెసిఆర్ నియంతృత్వ పాలన ను అంతమొందిస్తామని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version