ఏపీలో పంచాయతీ ఎన్నికల సమయంలో రోజుకొక చట్ట విరుద్ధమైన నిర్ణయాలు ప్రకటిస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. బాబు చెప్పేది…నిమ్మగడ్డ చెప్పేది ఒక్కటేనని చంద్రబాబు చెప్పే ఆదేశాలు ఇక్కడ లిఖిత పూర్వకంగా జారీ చేస్తున్నారని అన్నారు. ఇది క్షమించరాని నేరం అని పేర్కొన్న ఆయన మ్యానిఫెస్ట్ ను రద్దు చేయడానికి నిమ్మగడ్డ ఎవరు? అని ప్రశ్నించారు. ఓటు కూడా నమోదు చేసుకోవడం తెలియని వ్యక్తి ఎన్నికల కమిషనర్ ఉండటమా అని ప్రశ్నించిన ఆయన ఎన్నికల నియమావళి లేనివాటిని నిమ్మగడ్డ ఎలా అమలు చేస్తాడు అని ప్రశ్నించారు.
అధికారంలో ఉన్న మంత్రులు తప్పుచేస్తే సిఎం…సిఎస్ కు ఫిర్యాదు చేయకుండా. గవర్నర్ కు ఫిర్యాదు చేస్తారా ? అని ప్రశ్నించిన ఆయన ఫ్రివిలేజ్ కమిటీకి మేము ఫిర్యాదు చేశాము… ఆయన కమీటి సమాధానం చెప్పాల్సిన సమయం వస్తుందని అన్నారు. అలానే ఎన్నికల కమిషన్ చెప్పినట్లు ఏకపక్షంగా కలెక్టర్ కు, ఆర్ వోలకు చేస్తే… మా ప్రభుత్వం ఉన్నంత కాలం బ్లాక్ లిస్ట్ ఉంటారని అయన ఉద్యోగులను హెచ్చరించారు. ఎన్నికల కమీషన్ చెప్పినట్లు నడుచుకుంటే ప్రభుత్వం సీరియస్‌గా అ అధికారులపై చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఏకగ్రీవాలను చిత్తూరు …గుంటూరు అధికారులు వెంటనే ప్రకటించాలని, ఏ అధికారి కూడా ఎన్నికల కమీషన్ చెప్పినట్లు చేస్తే.. పేరు పేరు గుర్తు పెట్టుకుని చర్యలు తీసుకుంటామని అన్నారు.