అభివృద్ధికి చిరునామాగా ఉన్న వ్యక్తి చంద్రబాబు : పీతల సుజాత

-

నారా చంద్రబాబునాయుడు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి పీతల సుజాత మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబుకు హెరిటేజ్ మాత్రమే ఉందని, కానీ జగన్ కు అధికారికంగా, అనధికారికంగా లక్షల కోట్లు విలువ చేసే కంపెనీలు ఉన్నాయని ఆరోపించారు. 2004లో కేవలం రూ.కోటి 73 లక్షల ఆస్తి మాత్రమే కలిగివున్న జగన్ నేడు లక్షల కోట్లకు అధిపతిగా ఎలా ఎదిగాడు? అని పీతల సుజాత ప్రశ్నించారు. “అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయానికి చిరునామాగా ఉన్న చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్టు చేయడమే కాకుండా, ఆయనపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల వద్ద సానుభూతి పొందాలని ‘‘నేను ఒంటరివాడిని, సత్యహరిశ్చంద్రుడి’’నని మాట్లాడుతున్నాడు అంటూ హేళన చేశారు.

ఇది ఇలా ఉంటె, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్ వనస్థలిపురంలో ఆయన
మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎల్బీనగర్ భారాస ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, భాజపా కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తదితరులు తెదేపా అభిమానులకు సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. పనామా సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. నల్ల జెండాలు, ప్లకార్డులతో అభిమానులు నిరసనలో పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version