వాళ్లిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్..: నిహారిక

-

మెగా డాటర్ నిహారిక భర్తతో విడిపోయి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటుంది. ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు కుడా వెళ్లింది. తాజాగా, నిహారిక చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘నేను నా ఫ్యామిలీ ఇటీవల కెన్యాకు వెళ్లాం. కెన్యాకు వెళ్లాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. ఇప్పటికి కుదిరింది. నా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే టైం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. వాళ్లు ఇండియా వెళ్లిపోయారు కానీ నేను అమెరికాలో నా ఫ్రెండ్స్‌తో ఉన్నాను. ఎందుకంటే నా చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్ని వెబ్‌సిరీస్‌లను ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఒక సినిమాను కూడా ఓకే చేసాను. కాబట్టి నాకు ఒక 20 రోజులు బ్రేక్ కావాలి. అందుకే అమెరికాకు వచ్చాను అని తెలిపింది.

ప్రస్తుతం నా చేతిలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక సినిమాకు కూడా ఓకే చెప్పాను. కాబట్టి 20 రోజులు బ్రేక్ కోసం అమెరికాకు వచ్చాను. ఇక అన్నయ్య పెళ్లి గురించి చెప్పాలంటే.. పెళ్లి ఎక్కడ అనే విషయం ఇంకా ఫైనలైజ్ కాలేదు. పెళ్లి పనులు ఉన్నాయ్ త్వరగా వచ్చేయ్ అని అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. ఇక లావణ్య గురించి చెప్పాలంటే.. తను మా అన్నయ్యతో ప్రేమలో పడకముందే నాకు మంచి ఫ్రెండ్. వాళ్లిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్.. అంటూ చెప్పుకొచ్చింది నిహారిక.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version