పెగాసస్ కేసులో నేడు సుప్రీం తీర్పు..

-

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన పెగాసిస్ కేసులో సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది. పెగాసస్ కేసులో దర్యాప్తు చేయాలన్న పిటీషన్ పై ఈరోజు ఉదయం సుప్రీం కోర్ట్ ధర్మాసనం తీర్పు వెల్లడిచంనుంది. గత పార్లమెంట్ సమావేశాలకు ఒక్కరోజు ముందు వెలుగు చూసిన పెగాసస్ వ్యవహారం దేశంలో రాజకీయంగా మంటలు రేపింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పెగాసస్ వ్యవహారమే కీలకంగా మారింది. ప్రముఖులు, విపక్ష నేతలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, జర్నలిస్టులతో సహా 300 మంది ఫోన్లు హ్యక్ అయ్యాయంటూ వెలువడిన కథనాలు పెనుదుమారం రేపాయి.

దీంతో అధికార బీజేపీకీ వ్యతిరేఖంగా విపక్షాలు గళం విప్పాయి.  ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులపై ఉపయోగించాల్సిన నిఘా సాఫ్ట్ వేర్ ను విపక్ష నాయకులు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల ఫోన్లను హ్యక్ చేసేందుకు ప్రభుత్వం ఉపయోగించిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పెగాసస్ ను తాము దుర్వినియోగం చేయలేదని ప్రభుత్వం చెప్పినప్పటికీ విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. పెగాసస్ పై స్వతంత్ర దర్యాప్తు కొనసాగించాలని కోరతూ సీనియర్ జర్నలిస్టు ఎన్ రాయ్ శశికుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు మరికొంత మంది పిటిషన్ వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version