సాగు చేయకపోయినా…సాగుకు అనుకూలంగా ఉండే భూమికి రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఎకరానికి రూ.12వేలు ఇవ్వనున్నట్టు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జనవరి 26, 2025 పథకాలన్నింటిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వ్యవసాయం యోగ్యం కాని భూమికి.. మైనింగ్ చేస్తున్న భూములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు వినియోగిస్తున్న భూములకు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఇవ్వమని తెలిపారు. అలాగే పరిశ్రమలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు గ్రామాల వారిగా సమాచారం సేకరించి గ్రామ సభల ద్వారా రెవెన్యూ అధికారులు సమాచారం ఇస్తారని తెలిపారు. రేషన్ కార్డులు లేని వారికి కూడా రేషన్ కార్డులను మంజూరు చేస్తామని తెలిపారు.