న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. పెగాసస్ వ్యవహారంపై చర్చకు రెండు సభల్లోనూ ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. లోక్‌సభ ప్రారంభమవడంతోనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పెగాసస్‌పై చర్చ పట్టుపట్టాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల అరుపులు, కేకలతో లోకసభ దద్దరిల్లింది. అధికార ఎంపీలపై పత్రిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. విపక్షాల ఆమోదం లేకుండా పలు బిల్లులు ఆమోదించుకుంటున్నారని నినాదాలు చేశారు.