ఆరోగ్యాన్ని పెంపొందించే పద్ధతులు మీకోసం..!

-

ఆరోగ్యం లేని జీవితంలో ఏదీ సాధించలేము. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించడానికి వీలవుతుంది. శారీరకంగా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. అయితే ప్రతి రోజూ ఈ చిన్న చిన్న పద్ధతులని మీరు అలవాట్లు కింద మార్చుకుంటే తప్పకుండా ఆరోగ్యంగా జీవించడానికి వీలవుతుంది.

ఫిజికల్ యాక్టివిటీ:

ఫిజికల్ యాక్టివిటీ ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పరిశోధన ప్రకారం వారంలో కనీసం ఐదు రోజుల పాటు ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే రెస్పిరేటరీ సంబంధించిన సమస్యలు 50 శాతం వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా 30 నిమిషాల పాటు వారానికి మూడు సార్లు యోగా చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. శ్వాస సంబంధిత సమస్యలు మొదలు ఒత్తిడి వారు ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.

పోషకాహారం:

వ్యాయామం ఎంత ముఖ్యమో ఆహారం కూడా అంతే ముఖ్యం. ఎక్కువ ఫ్యాట్, క్యాలరీలు ఉండే ఆహారం మరియు ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆహారంలో సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ, స్ట్రోక్, డిమెన్షియా వంటి సమస్యలు వస్తాయి. గోధుమ గడ్డి, కొబ్బరి పాలు, బీట్రూట్, పాలకూర మొదలైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది.

హైడ్రేట్ గా ఉండండి:

హైడ్రేషన్ కూడా శ్వాసకి చాలా ముఖ్యం. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల పోషక పదార్థాలు శరీరంలో అన్ని భాగాలకుకి అందుతాయి. అదే విధంగా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. అందుకోసం రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల మంచి నీళ్ళు తాగడం మంచిది.

నిద్ర :

ప్రశాంతంగా నిద్ర పోవడం కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. 2015 స్టడీ ప్రకారం రీసెర్చర్లు ప్రతిరోజు రాత్రి ఏడు గంటల పాటు నిద్రపోతే ఆరోగ్యం మరింత ఇంప్రూవ్ అవుతుందని చెబుతున్నారు. ఇలా ఆరోగ్యకరమైన పద్ధతులని అనుసరిస్తూ శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. దీనితో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని మరెంత బాగా వుంచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version