విశాఖను జనం ఒప్పుకుంటున్నారంటున్న బాబు అనుకూల మీడియా!!

-

పాలనవికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదం తెలిపిన మరుక్షణం నుంచి టీడీపీ అనుకూల మీడియా ఆర్థనాధాలు ఏపీ రాజకీయాల్లో మిన్నంటాయి! 24 గంటలూ వారి అనుకూల నేతల డిబేట్ లతో అల్లకల్లోలాలు చేస్తున్నాయి! ఇక్కడ చర్చలో పాల్గొన్న నేతల సమాధానాలకంటే… 10రెట్లు ఎక్కువగా భారీ భారీ ప్రశ్నలతో యాంకర్లు చెలరేగిపోతున్నారు! ఈ క్రమంలో ఏపీ ప్రజలు మొత్తం విశాఖనే కోరుకుంటున్నారు అనే సంకేతాలు ప్రజలకు ఇచ్చారు! ఇది తెలిసిన అన్నారా.. ఆవేశంగా ప్రశ్నలు కురిపించే క్రమంలో అన్నారో తెలియదు కానీ.. బాబు కు షాక్ ఇచ్చారు!

విమర్శించాలనే ఉద్దేశ్యం ఉన్నా… ఆలోచించి ప్రశ్నించాలన్న అవగాహన కూడా యాంకర్లకు ముఖ్యమని.. అలా కానిపక్షంలో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలున్నాయని తెలియజేసే చర్య ఒకటి తాజాగా టీడీపీ అనుకూల టీవీ ఛానల్ లో నల్లదుస్తులు ధరించి తమ నిరసనను తెలియజేస్తున్న యాంకర్ వల్ల జరిగింది! సీనియర్ బీజేపీ నేతను డిబేట్ కి పిలిచిన ఆయన… మోడీని ఇరుకున పెట్టాలనే ఆలోచనలో భాగంగా… అమరావతిని కాపాడతానన్న బీజేపీ ఎందుకు చేతులెత్తేసింది? అని ప్రశ్నించారు. అంతవరకూ బాగానే ఉంది!

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వికేంద్రీకరణ ఆగేది కాదా?.. లోకాయికారీ ఒప్పందాలతోనే మరణ శాసనం లిఖించారా?.. మోదీ వేసిన శంకుస్థాపన రాయి ఇక సమాధిగా మిగిలిపోనుందా?.. అంటూ ఫైరయ్యారు. అదీ బాగానే ఉంది కానీ… అనంతరం ఆయన చెప్పిన మాట… “ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడ ఇది” అన్నది!! సరిగ్గా ఇక్కడే యాంకర్ బాబు దొరికిపోయారని అంటున్నారు!

నిజంగా మూడు రాజధానుల బిల్లు ఆమోదం వెనక బీజేపీ హస్తం ఉండి… విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపుకు అనుకూలంగా స్పందించడం వల్ల… ఏపీలో బీజేపీకి క్రెడిట్ పెరుగుతుంది అని అంటే.. కచ్చితంగా ఏపీ ప్రజలు విశాఖను రాజధానిగా కోరుకుంటున్నట్లే కదా!! నిజంగా బీజేపీ ఏపీలో పాగావేసేందుకు వేసిన ఎత్తుగడగా, ఈ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదముద్ర వేసింది అని అంటే… మెజారిటీ ఏపీ ప్రజలు మూడు రాజధానులను స్వాగతిస్తున్నట్లే కదా!! ఆ యాంకర్ అభిప్రాయం ప్రకారం… తనకు ప్లస్ అవ్వని పని బీజేపీ చేయదు కదా! ప్లస్ అవ్వాలంటే ప్రజలు ఒప్పుకోవాలి కదా… ప్రజలు ఒప్పుకుంటున్నారంటే… మూడు రాజధానులకు మద్దతు తెలిపినట్లే కదా!! హతవిధీ…!!

Read more RELATED
Recommended to you

Exit mobile version