వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రెవెన్యూ,గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో జరిగిన శ్రీ సీతారామ లక్ష్మణ, ఆంజనేయ, శిఖర, ధ్వజ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలంతా ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని, వివిధ రంగాల్లో ఉన్న వారందరినీ ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆ దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు.అనంతరం మంగాపురం తండా తదితర ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకల్లో మంత్రి పొంగులేటి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.