బీఆర్ఎస్ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకుముందు సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు నోట్ ద్వారా స్పష్టం అవుతోంది. వివరాల్లోకివెళితే.. ఆశాప్రియ అనే మహిళ బీఆర్ఎస్ కేడర్‌గా పనిచేస్తున్నది. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆమె చురుకుగా పాల్గొంటున్నట్లు సమాచారం. అయితే, ఇటీవల ఆమెకు సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువ అయ్యాయి. దీంతో ఆదివారం ఉదయం ఆత్మహత్యాయత్న్ం చేసినట్లు తెలుస్తోంది.
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆశా ప్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సూసైడ్ అటెంప్ట్‌కు ముందు ‘కేటీఆర్ అన్న ఈ చెల్లెలు పిలుపు ఇదే చివరిసారి అవుతుంది..ఒక్కసారి పలుకు అన్నా అంటూ ఎక్స్ లో చివరి పోస్ట్’ చేసినట్లు గుర్తించారు. ఆమెను ఎవరు వేధింపులకు గురిచేశారనేది తెలియాల్సి ఉన్నది.
బీఆర్ఎస్ మహిళా కార్యకర్త ఆశా ప్రియ ఆత్మహత్యాయత్నం..
మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
ఆశా ప్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
కేటీఆర్ అన్న ఈ చెల్లెలు పిలుపు ఇదే చివరిసారి అవుతుంది.. ఒక్కసారి పలుకు అన్నా అంటూ ఎక్స్ లో చివరి పోస్ట్
సోషల్ మీడియాలో టార్చర్ భరించలేక ఆశా… pic.twitter.com/C9ShOcIrQQ
— BIG TV Breaking News (@bigtvtelugu) May 11, 2025