వేసవిలో గిరిజన తండాల్లో ప్రజలు అల్లాడుతున్నారు.తాగునీటి సౌకర్యం లేక గొంతు ఎండుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు తాగు నీటి సౌకర్యం కల్పించాలని గిరిజన ప్రజలు ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తునారు.
రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం అగ్రహారం తండాలో తాగు నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో ఖాళీ బిందెలతో గిరిజన మహిళలు రోడ్డెక్కి నిరసనకు తెలుపుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర అవస్థలు పడుతున్నామని.. అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదంటున్న గిరిజనులు వాపోతున్నారు.కేసీఆర్ ప్రభుత్వంలో నీటి సమస్య రాలేదని, నీళ్లు రాక పాత రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుకు చేస్తుందని గిరిజన మహిళలు చెబుతున్నారు.ప్రభుత్వం స్పందించి నీళ్లు వచ్చే విధంగా చూడాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.