కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ప్రతిష్టాత్మకంగా అందజేయాలనుకున్న 4 పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభలు నిర్వహించి అందులో అర్హులను ఎంపిక చేయాలని భావించింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు అధికారులు, కాంగ్రెస్ నేతల సమక్షంలో ప్రారంభం అయ్యాయి.
కాగా, లబ్దిదారుల్లో తమ పేర్లు రాలేదని చాలా చోట్ల ప్రజలు ఎదురుతిరుగుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని భీమారం మండలం పొలంపెల్లి గ్రామసభలో గందరగోళం నెలకొంది.మొదటి విడత రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు రాలేదని, గ్రామ సభను రద్దుచేసి మళ్ళీ గ్రామంలో సర్వే చేపట్టి అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చెయ్యాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
అదేవిధంగా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రజల ఆందోళనకు దిగారు. రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు లేదని, తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఆందోళన చేపట్టారు. ఇక నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఏడ్ బిడ్ గ్రామంలో గ్రామ సభలో అధికారులను,కాంగ్రెస్ నేతలను ఆరు గ్యారెంటీలు, తులం బంగారం ఏమైందని గ్రామస్తులు నిలదీశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలోని గ్రామసభలో ఆరు గ్యారెంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై ప్రజలు ప్రశ్నించారు.
గ్రామ సభలో అధికారులను, కాంగ్రెస్ నేతలను నిలదీసిన గ్రామస్థులు
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఏడ్ బిడ్ గ్రామంలో గ్రామ సభలో అధికారులను, కాంగ్రెస్ నేతలను నిలదీసిన గ్రామస్తులు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లపై నిలదీసిన ప్రజలు
గతంలో ప్రభుత్వం చేసిన సర్వేలు… https://t.co/NvfjeytmB8 pic.twitter.com/fnYjECGHwc
— Telugu Scribe (@TeluguScribe) January 21, 2025