ఐటీ దాడులపై స్పందించిన దిల్ రాజ్ భార్య తేజస్విని స్పందించారు. ఈ సందర్భంగా దిల్ రాజ్ భార్య తేజస్విని మాట్లాడుతూ…. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి ఐటి వాళ్ళు తీసుకెళ్లారన్నారు. ఉదయం నుంచి ఐటి శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారని వెల్లడించారు.
సినిమా రిలేటెడ్ లో భాగంగానే సోదాలు చేస్తున్నారన్నారు. ఐటీ సోదాలు జనరల్ గా జరిగే సోదాలు మాత్రమేనని వివరించారు. ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ కావాలని అడిగారని తెలిపారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని చెప్పారు.
కాగా, టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇక పుష్ప2 మూవీ మైత్రీ సంస్థ మీద కూడా జరుగుతున్నాయి ఐటి దాడులు. మైత్రీ నవీన్, సిఇఒ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. అటు మాంగో మీడియా సంస్థ లోకూడా సోదాలు జరుగుతున్నాయి. సింగర్ సునీత భర్త ..రాము కు సంబంధిన సంస్థ మాంగోపై దాడులు కొనసాగుతున్నాయి.